తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సమనస ఎస్‌బీఐలో బంగారు నగలు తాకట్టు పెట్టుకుండానే కోటి యాభై లక్షల రూపాయల రుణం పొందిన విషయం వెలుగులోకి వచ్చింది.

బ్యాంక్‌లో పనిచేసే ఉద్యోగే ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇందులో ఒక్కరి పాత్రే ఉందా లేక ఇంకెవరైనా దీని వెనుక ఉన్నారా అన్న కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

విచారణ పూర్తయ్యాకే అన్ని విషయాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.