ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో నిర్ధోషిగా విడుదలైన సత్యంబాబు ఒక ఇంటివాడయ్యాడు. గురువారం వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. 

ఇకవివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన సత్యంబాబు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చందరుతండాకు చెందిన అనితను వివాహం చేసుకున్నాడు. అయేషా మీరా హత్యకేసులో నిర్దోషిగా బయటపడటంతో ఇకపై నూతన జీవితం ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయేషా మీరా హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ హత్యకేసులో సత్యంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలితంగా చాలా ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు సత్యంబాబు. అయితే అతను నిర్దోషి అని రుజువు కావడంతో గత ఏడాది విడుదలయ్యాడు.