తాను క్యాండిల్స్ తయారీ బృందంలో పనిచేస్తానని చిన్నమ్మ బదులిచ్చారు. క్యాండిల్స్ తయీరీ చేసినందుకు చిన్నమ్మకు అధికారులు రోజుకు రూ. 50 దినసరి కూలీ ఇవ్వనున్నారు.
తనకు ప్రత్యేక గది కావాలి..ఓ సహాయకుడు కూడా కావాలి...టివి, మంచం,మినరల్ వాటర్ కావాల్సిందే...ఇవన్నీ చిన్నమ్మ అనబడే శశికళ పరప్పణ జైలు అధికారుల ముందుంచిన డిమాండ్లు. అయితే, వాటన్నింటినీ జైలు అధికారులు కొట్టిపారేసారు. ఇతర ఖైదీల్లాగే శశికళను ట్రీట్ చేస్తామంటూ స్పష్టం చేసారు. జయలలితను ఉంచిన గదిలోనే తనను ఉంచాలంటూ శశికళ చేసిన డిమాండ్ నూ అధికారులు పట్టించుకోలేదు. పైగా జైలులోని ఇతర సాధారణ ఖైదీలలాగా ఉండాలంటూ స్పష్టం చేసారు. అదేవిధంగా చిన్నమ్మకు ఓ గది కేటాయించి మరో ఖైదీతో పంచుకోమన్నారు.
అంతేకాకుండా జైలులో ప్రతీ రోజూ పని(కూలీ) చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. క్యాండిల్స్ తయారు చేస్తారో లేక అగరుబత్తీలను తయారు చేస్తారో తేల్చుకోమంటూ అధికారులు శశికళకే అవకాశాన్ని వదిలిపెట్టారు. దాంతో తాను క్యాండిల్స్ తయారీ బృందంలో పనిచేస్తానని చిన్నమ్మ బదులిచ్చారు. క్యాండిల్స్ తయీరీ చేసినందుకు చిన్నమ్మకు అధికారులు రోజుకు రూ. 50 దినసరి కూలీ ఇవ్వనున్నారు.
విధిరాత ఎలాగుంటుందన్న విషయం చిన్నమ్మను చూస్తే అర్ధమైపోతుంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని తమిళనాడును ఏలాలని ఆశించిన శశికళ చివరకు పరప్పణ జైలులో కూర్చోవాల్సి వచ్చింది. ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడ’ని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమైంది చిన్నమ్మ విషయంలో. విచిత్రమేమిటంటే, తనపై కేసులున్నాయని, తీర్పులు వస్తాయని, శిక్షపడటం ఖాయమని శశికళకు బాగా తెలుసు. అయినా అన్నింటినీ కాదని తానేమనుకుంటే అదే జరుగుతుందన్న అహంకారమే శశికళలో కనపడింది. ఆ అహంకారమే చిన్నమ్మ మొహంలో ఉక్రోషంగా బయటపడింది. అయితే, జైలుకు వెళ్ళే సమయంలో జయ సమాధి వద్ద చిన్నమ్మ నడిపిన నాటకీయత బాగానే పడింది.
