దాడికి పాల్పడ్డ నిందితులు టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులుగా చెబుతున్నారు.

అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. కూడేరు మండలం జల్లిపల్లిలో ఓ ఒంటరి మహిళపై ఆ గ్రామ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర దాడికి దిగారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళను విచక్షణారహితంగా కొట్టారు. కాళ్లతో తన్ని హింసించారు.

దాడికి పాల్పడ్డ నిందితులు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులుగా చెబుతున్నారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటపడటంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

http://newsable.asianetnews.tv/video/village-sarpanch-thrashes-woman-for-standing-up-against-him