Asianet News TeluguAsianet News Telugu

makar sankranti 2024 : పల్లెకు బయల్దేరిన నగరవాసి.. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య జరుపుకునేందుకు నగరవాసి సొంతూళ్లకు బయల్దేరాడు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రప్రదేశ్ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో బయల్దేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. 

sankranti rush on hyderabad vijayawada national highway ksp
Author
First Published Jan 11, 2024, 7:07 PM IST

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య జరుపుకునేందుకు నగరవాసి సొంతూళ్లకు బయల్దేరాడు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రప్రదేశ్ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో బయల్దేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీనికి తోడు ప్రతి వాహనాన్ని పోలీసులు తనికీ చేసి పంపుతూ వుండటంతో మరింత ఆలస్యమవుతోంది. 

మరోవైపు.. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకు మరో 6 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జనవరి 10 నుంచి 15 మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన 32 ప్రత్యేక రైళ్లు రెండు రాష్ట్రాల మధ్య నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ప్రత్యేక రైళ్లు ఇవే :

  • తిరుపతి-సికింద్రాబాద్(07055) - జనవరి 10
  • సికింద్రాబాద్-కాకినాడ టౌన్(07056)-జనవరి 11
  • కాకినాడ టౌన్-సికింద్రాబాద్(07057)- జనవరి 12
  • సికింద్రాబాద్-కాకినాడ టౌన్(07071)-జనవరి 13
  • కాకినాడ టౌన్-తిరుపతి(07072)-జనవరి 14
  • తిరుపతి-కాచిగూడ(02707)-జనవరి 15
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios