టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) ధర్మకర్తల మండలి సభ్యుడిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పునర్నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సండ్ర ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

నిబంధనల ప్రకారం.. ఆయన ధర్మకర్తల మండలి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో సండ్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సండ్ర వెంకట వీరయ్యను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా మరోసారి నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన ఆ పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.