చంద్రబాబు హెచ్చరికలకు, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న దానికి అసలు సంబంధమలేదు. మూడేళ్ళ క్రితం అధికారంలోకి రాగానే ఇసుకను చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారు. వెంటనే మంత్రులు, ఎంఎల్ఏలు, పార్టీ నేతలు పలువురు పోలోమంటూ ఇసుక వ్యాపారాల మీద పడ్డారు.

‘‘ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్ధితుల్లోను సహించేది లేదు...అక్రమార్కులూ కబడ్దార్’’...ఇది తాజాగా చంద్రబాబునాయుడు రాజమండ్రిలో చేసిన హెచ్చరిక. కొత్తగా ఎవరైనా హెచ్చరికలు వింటే అమ్మో ఇంకేముంది? ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళ పని అయిపోయినట్లే..అని అనుకుంటారు. కానీ జరుగుతున్నదేంటి?

చంద్రబాబు హెచ్చరికలకు, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న దానికి అసలు సంబంధమలేదు. మూడేళ్ళ క్రితం అధికారంలోకి రాగానే ఇసుకను చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారు. వెంటనే మంత్రులు, ఎంఎల్ఏలు, పార్టీ నేతలు పలువురు పోలోమంటూ ఇసుక వ్యాపారాల మీద పడ్డారు.

ఇంకేముంది పెట్టుబడి లేకుండానే కోట్ల రూపాయల ఆదాయం. సముద్ర తీరాలు, నదీ, చెరువులు, వాగులని చూడకుండా ఎక్కడ అవకాశముంటే అక్కడిన నుండి యధేచ్చగా ఇసుకను అక్రమ రవాణా చేసుకుంటూ కోట్లకు పడగలెత్తిన నేతలున్నారు. చింతమనేని ప్రభాకర్-వనజాక్షి వివాదం కేవలం బయటపడ్డ ఒక ఆధారం మాత్రమే.

అక్రమ వ్యాపారం మరీ శృతిమించిపోగా జనాల్లో గగ్గోలు మొదలైంది. దాంతో ప్రభుత్వానికి ఇబ్బందైంది. దాంతో ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పేరుకుమాత్రమే ఇసుక ఉచితం. కానీ రవాణా వాహనాల అద్దెలు తదితరాలను కలుపుకుంటే తడిసిమోపెడవుతోంది. ఈ విషయాలేవీ చంద్రబాబుకు తెలియనివి కావు.

ఇదిలావుండగా టిడిపికి బహిరంగంగానే మద్దతు పలికే ఓ మీడియాలో ఇసుక అక్రమ రవాణాపై చాంతాడంత స్టోరీ ఫొటోలతో సహా వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక అక్రమ రవాణా అవుతోందనే విషయాలను కూడా ప్రచురించారు. ఏ జిల్లాలో ఎన్ని రేవులున్నాయి, ఎన్ని రీచులున్నాయి, ఎక్కడి నుండి ఎక్కడికి అక్రమ రవాణా జరుగుతోందన్న విషయాలను కుడా కళ్ళకు కట్టినట్లు వివరించారు.

ప్రభుత్వం ఉప్పు తింటున్నామనుకున్న కొందరు ఉద్యోగులు అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుందామని ప్రయత్నించారు. కానీ వారిపై నేతలు దాడులు చేసి చావగొట్టారు. దాంతో మిగితావారు తమకెందుకులే అని గాలికొదిలేసారు. ఇదంతా చూసిన తర్వాత కుడా ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతానని చంద్రబాబు చేసిన హెచ్చరికలను నమ్మేవాళ్ళుంటారా?