మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు తాజాగా మరో వివాదానికి తెరతీశారు. ఆమె  నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పద మవుతున్నాయి. మహారాజ కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకి తరలించాలని తాజాగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో ఉద్యోగులు సంచయిత నిర్ణయంపై మండిపడుతున్నారు. కార్యాలయం మార్పుతో పాటు, కార్యాలయంలోని పది మంది సిబ్బందిని కూడా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే కార్యాలయం ఆధునీకరణ కోసమే తరలింపు ఆదేశాలు జారీ చేశారని ఈవో చెబుతున్నారు. 

కాగా ఆందోళనకారుల ప్రతిఘటన నుంచి తప్పించుకోవడానికే సంచయిత గజపతిరాజు కొత్త ఎత్తుగడ అని విమర్శలు వస్తున్నాయి. మహారాజ కోటలోకి మీడియా ప్రవేశం కూడా రద్దు చేశారు. ఈవో అనుమతి ఉంటేనే కోటలోకి అనుమతి అని అధికారులు చెబుతున్నారు.