ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నాగిరెడ్డి అనే వ్యక్తి తాడేపల్లిలో దౌర్జన్యానికి దిగాడు. స్థల వివాదంలో జోక్యం చేసుకుని అడ్డొచ్చిన వృద్ధుడిని, ఓ మహిళను చితకబాదాడు. 

ఏపీ సీఎం , వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (ys jagan mohan reddy) నివాసానికి కూత‌వేటు దూరంలో తాడేప‌ల్లి ప‌రిధిలో ఓ వృద్ధుడిపై సాక్షి దిన‌ప‌త్రిక‌లో విలేక‌రిగా ప‌నిచేస్తున్న నాగిరెడ్డి అనే వ్యక్తి దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) , ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) తీవ్రంగా స్పందించారు. 

"ఇదిగో సాక్షి గూండాల బరితెగింపు....! అది కూడా స్వయంగా సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో! ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి... వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదంతో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

"యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు. వైసిపి నాయకులు భూ కబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు సాక్షి సిబ్బంది. మంగళగిరి నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్ నాగి రెడ్డి దాష్టీకం చూస్తుంటే..ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని అర్థమవుతుంది.ప్రైవేట్ భూ వివాదంలో జోక్యం చేసుకోవడమే తప్పు అయితే, ఆ స్థలయజమాని అయిన వృద్ధుడు కాళ్ళు పట్టుకొని చంపొద్దని ప్రాధేయపడినా వదలకుండా దాడికి పాల్పడటం దారుణం. అడ్డొచ్చిన మహిళను కాలితో తన్నిన సాక్షి విలేకరి నాగిరెడ్డి అరాచకాలకి అడ్డే లేకుండా పోతోంది" అని లోకేశ్ ఫైర్ అయ్యారు. 

Scroll to load tweet…