అమరావతి: తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు అరెస్టు రాత్రికి రాత్రే జరిగింది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు సిఐడీ సూమోటోగా కేసు నమోదు చేసిందని, రఘురామ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఎక్కడా లేదని ఆయన అన్నారు. టీడీపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రఘురామ రాజును వాడుకుంటున్నారని ఆయన అనన్నారు.

కుట్రపూరిత వ్యవహారంలో భాగంగానే రఘురామ కృష్ణమ రాజు ప్రభుత్వంపై విద్వేషం ప్రదర్శిస్తూ వస్తున్నారని, రఘురామ కృష్ణమ రాజును పావుగా వాడుకున్నారని ఆయన అన్నారు. టీడీపీ, దాని అనుకూల మీడియా బండారం బయపడుతుందనే కారణంతోనే రఘురామ అరెస్టు ఉదంతంపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఏడాది నుంచి రఘురామకృష్ణమ రాజు విద్వేషం వెదజల్లుతున్నారని ఆయన అన్నారు. రఘురామ కృష్ణమ రాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని తాము లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని ఆయన గుర్తు చేశారు. రఘురామ అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఎక్కడా లేదని ఆయన అన్నారు. హైకోర్టు

అన్నింటికీ చంద్రబాబు అతీతుడైనట్లు మాట్లాడుతున్నారని, ప్రజలను చంద్రబాబు ఏమనుకుంటారనే విషయం అందరికీ తెలుసు, ప్రజలు మరిచిపోతారని అనుకుంటారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎదురు దెబ్బలు తింటున్నారని ఆయన అన్నారు. హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాతనే తనను కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కొత్త కథకు శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. చట్టానికి లోబడే సిఐడి రఘురామను అరెస్టు చేసిందని ఆయన చెప్పారు. 

రఘురామను కొట్టిన దాఖలాలు లేవని మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని, సీల్డ్ కవర్ లో ఆ నివేదిక ఇచ్చిందని, ఇందులో ప్రభుత్వ పాత్ర ఎక్కడా లేదని ఆయన అన్నారు. రఘురామ ఓ వైపు కాలు చూపిస్తారు, మరో వైపు మీసం మెలేస్తారు, భుజంపై చేతులు వేసి నడుస్తారని ఆయన అన్నారు. 

రఘురామ వ్యవహారం వెనక కుట్ర కోణం ఉందని, చంద్రబాబు అందుకే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నేతలు తమను కొట్టినట్లు ఎక్కడా కొట్టినట్లు చెప్పలేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని రఘురామ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 

కేసీఆర్ మీద కేసు పెట్టినప్పుడు రాజకీయం అనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరిపై కూడా కేసు పెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టినప్పుడు అది కక్ష సాధింపు చర్యలు కావా అని ఆయన అడిగారు. లాయర్లు మీటింగ్ పెట్టుకుంటే రాజద్రోహం కేసు పెట్టారని ఆయన అన్నారు. హక్కుల భంగం అంటే ఎర్రచంనదనం స్మగ్లర్లను కాల్చి చంపడమని ఆయన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగి ఉదంతాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ ఏం చేశారు, చంద్రబాబుకు ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు కేసులు పెట్టారు అనే విషయాలు అందరికీ తెలుసునని ఆయన అననారు. 

రఘురామరాజుతో సుజానా చౌదరి, నారా లోకేశ్, చంద్రబాబు ఏం  మాట్లాడారని ఆయన అడిగారు. అది కుట్ర చేయడం కాదా అని ఆయన అడిగారు. కుట్ర చేసినట్లు పక్కా ఆధారాలున్నాయని ఆయన అన్నారు.  ప్రజలను మభ్య పెట్టాలని, తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.