Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వ్యుహాంలో భాగంగానే ట్యాపింగ్.. రాజకీయంగా వాళ్లు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు: సజ్జల కీలక కామెంట్స్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యుహాంలో భాగంగానే ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 

sajjala ramakrishna reddy says no chances for phone tapping
Author
First Published Feb 2, 2023, 3:46 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యుహాంలో భాగంగానే ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు గతంలో ఇలాంటివి చేయించేవారని.. ఇప్పుడు అలా జరిగిందని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ట్యాపింగ్ ఆరోపణలతో నాలుగు రోజులు డ్రామాలు ఆడతారని విమర్శించారు. అది ట్యాపింగే కాదని.. కాల్ రికార్డు అని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాల్ డేటా బయటపెట్టాలని కోరారు. 

ఫోన్ ట్యాపింగ్ అనేదానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. కోటంరెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి ఆడియో వెళ్లిందని.. దానిని ఎవరూ నిరాకరించడం లేదని అన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టికి ఆడియో వచ్చి ఉంటే.. ఆయన కోటంరెడ్డికి సమాచారం ఇచ్చి ఉంటారని చెప్పుకొచ్చారు. అందులో ట్యాపింగ్ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. నిజంగా ట్యాపింగ్ జరిగిఉంటే.. సీబీఐకి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. కోటంరెడ్డి కాల్ చంద్రబాబు రికార్డు  చేయించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అసలు ఇష్యూ కానీ దానిని.. వాళ్లకు వాళ్లే క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా వాళ్లు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 

Also Read: ఆ ఆడియోను ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు పంపారు.. జగనన్న నీ ఫోన్ ట్యాప్ చేస్తే..?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

టీడీపీ నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారని.. ముందుగానే మాట్లాడుకుని ఉంటారేమోనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ జరిగిఉంటే.. చంద్రబాబు నాయుడుతో కోటంరెడ్డి ఏదైనా మాట్లాడి ఉంటే అవి కూడా బయటకు వచ్చేవి కదా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ అనేదే లేనప్పుడు విచారణ ఏముండదని అన్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios