Asianet News TeluguAsianet News Telugu

Sajjala Ramakrishna Reddy: ఓటీఎస్‌పై చంద్రబాబు అనవసర రాద్దాంతం.. అప్పుడు ఆయన ఏం చేశారు?.. సజ్జల కౌంటర్

ఓటీఎస్‌పై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. ఓటీఎస్ స్కీమ్‌లో ఎవరు బలవంతపు వసూళ్లు చేయడం లేదని, టార్గెట్‌లు పెట్టడం లేదని అన్నారు. 

sajjala Ramakrishna Reddy Counter To chandrababu Over ots Issue
Author
Tadepalli, First Published Dec 6, 2021, 3:24 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై (Chandrababu Naidu) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటీఎస్‌‌పై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ విషయంలో ప్రజలను ఎవరూ బలవంతం పెట్టడం లేదని అన్నారు. చంద్రబాబు పేదల ఇళ్ల కోసం ఏమి చేయలేదని అన్నారు. చంద్రబాబు విమర్శలు అర్ధరహితమైనవి మండిపడ్డారు. తమ ప్రభత్వం నామమాత్రం ఫీజు తో పేదలకు ఇళ్ళని రిజిస్ట్రేషన్ చేస్తుందని సజ్జల అన్నారు. దీనికి చంద్రబాబు సహాయ నిరాకరణ చేయాలి అని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు సహాయనిరాకరణ అనడంపై  ఆలోచన చేయాలని సూచించారు. ఓటీఎస్ పథకంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు బలవంతపు వసూళ్లు చేయడం లేదని, టార్గెట్‌లు పెట్టడం లేదని అన్నారు. 


చంద్రబాబు ఈ మధ్య ప్రజలను తిట్టడం మొదలుపెట్టారని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 30 లక్షల మందికి సొంతంగా ఇళ్లు కట్టిస్తోందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇళ్ల రిజిస్ట్రేషన్ ఫ్రీ అని అంటున్నారు.. మరి ఆ పని 2014-19 మధ్య ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎవరైనా కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also read: Chandrababu Naidu: ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా..?.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

ఉద్యోగులు, ప్రజలు.. ప్రభుత్వంలో భాగమని చెప్పిన సజ్జల.. తమకు ఉద్యోగులపై ప్రేమ, అభిమానం ఉంటుందని.. వ్యతిరేకత ఉండదని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చగలం అనుకునే ఉద్యోగ సంఘం ఎవరైనా  సొంతగా పార్టీ పెట్టుకోవచ్చని వ్యంగ్యస్త్రాలు సంధించారు. షేకావత్.. కేంద్ర మంత్రి ఎలా అయ్యారో అర్ధం కావడం లేదని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు పై కేంద్రమంత్రి షేకావత్ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఇద్దరు టీడీపీ ఏజెంట్లు షేకావత్ పక్కన ఉన్నారని.. అందుకే ఆయన అలా మాట్లాడి ఉంటారని తాను అనుకుంటున్నానని చెప్పారు.  


ఇదిలా ఉంటే..  ఓటీఎస్‌పై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను దోపిడీ చేస్తుందన్నారు. ఇళ్లకు ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్మెంట్) పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. పేద ప్రజలు ఎందుకు ఓటీఎస్ కట్టాలని ప్రశ్నించారు. ఓటీఎస్ కట్టాలని అధికారులు ఒత్తిళ్లు చేయడమేమిటని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు, అధికారుల ఒత్తిళ్లు చట్టవిరుద్దం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

OTS కట్టని ప్రజలను వేధిస్తున్నారని చెప్పారు. పట్టా ఇవ్వడానికి వైఎస్ జగన్ ఎవరని.. ఆయన స్థలం ఇచ్చారా..?, ఇళ్లు కట్టించారా..? అంటూ ధ్వజమెత్తారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ (ys jagan).. మాట తప్పారని, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట తప్పినందుకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఉన్మాదం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ఓటీఎస్ టార్గెట్లు పూర్తి చేయడం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులే వారికి శాపంగా మారతాయని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios