ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలు వున్నాయి కానీ విబేధాలు లేవన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం ఇద్దరు వ్యక్తులకైతే విబేధాలుంటాయని.. కానీ ఒక రాజకీయ సిద్ధాంతంలో మాత్రం భిన్నాభిప్రాయాలుంటాయని ఆయన చెప్పారు.

కొత్త పార్టీని జగన్ వద్దన్నారని.. ఎందుకంటే నమ్ముకున్న వారికి న్యాయం చేయలేం ఏమోనని ఆయన అభిప్రాయమన్నారు. అయితే తాను పాదయాత్ర చేశాను కాబట్టి సొంతంగా ట్రై చేస్తానని షర్మిల చెబుతున్నారని సజ్జల పేర్కొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం ఏర్పడిందని.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఓ మేజర్ పొలిటికల్ పార్టీ అన్నారు. పార్టీ పెడితే షర్మిల బయటి వ్యక్తి అవుతారని.. మద్ధతు అనేది జరిగితే రెండు పార్టీల మధ్య జరుగుతుందని సజ్జల తేల్చి చెప్పారు. 

షర్మిల వైసీపీ లైన్ దాటారని.. తెలంగాణ రాజకీయాలపై జగన్ స్పష్టమైన వైఖరితో వున్నారని ఆయన వెల్లడించారు. ఏపీ సర్కార్‌తో తలపడతామని అన్నవాళ్లు ఎవరో, వారి స్థాయి ఏంటో నాకు తెలియదన్నారు.

Also Read:జగన్ వద్దన్నాడు, షర్మిల ఆలోచన మరో విధంగా ఉంది: సజ్జల

వైసీపీ పుట్టినప్పటి నుంచి వున్నదున్నట్లు చెప్తుందే తప్ప.. రాజకీయ వ్యూహాలుండవని సజ్జల స్పష్టం చేశారు. అంతకంటే పెద్ద పెద్దవే జరిగాయని.. ఇవి నిలబడతామని అనుకోమన్నారు.

జగన్ , షర్మిల మధ్య వ్యక్తిగత విబేధాలు వుండని రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడం అనేది ఏమీ లేదని.. సహకరించారు కాబట్టే షర్మిల పాదయాత్ర చేశారని సజ్జల గుర్తుచేశారు.

పార్టీలో పదవులు ఇవ్వలేని ఆమె ఇంకో పార్టీ పెట్టారని అనుకోవట్లేదన్నారు. వైఎస్ మార్గదర్శకత్వంలో షర్మిల పార్టీ పెట్టాలనుకుంటున్నారని చెప్పారు. అయితే జగన్ విషెస్ ఉంటాయనే అనుకుంటున్నానని.. అలాగే షర్మిలకు తన శుభాకాంక్షలు తెలిపారు సజ్జల.

పార్టీ విషయంలో షర్మిలమ్మ జగన్‌తో సంప్రదించలేదని.. పార్టీ ఏర్పాటు సాహసోపేత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే జాతీయ స్థాయిలో సైతం రాజకీయాలు చేయగలరని.. పార్లమెంట్‌లోని నాలుగో పెద్ద పార్టీగా ఢిల్లీలో కూర్చొవచ్చన్నారు.

కానీ ఆయన తనను నమ్ముకున్న వారికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో వున్నారని సజ్జల చెప్పారు. అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు లేవని.. ఎలాంటి వ్యక్తిగతమైనవి లేవని, కేవలం వైసీపీని రెండు రాష్ట్రాల్లో వుంచాలా వద్దా అనే దానిపైనే భిన్నమైన అభిప్రాయాలు వున్నాయని రామకృష్ణారెడ్డి వెల్లడించారు.