విజయవాడ: కృష్ణా జిల్లా నిడమానూరులోని షిరిడీ సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో బాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో గుడి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, జనసేన పార్టీ నాయకులు గుడివద్దకు చేరుకుని నిరసన తెలియజేస్తుంటే స్థానిక వైసీపీ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ గ్రామ సమస్యను తామే పరిష్కారం చేసుకుంటామని... మీరు ఈ విషయాన్ని ఎక్కువ చేయకండి అని బాహాబాహికి దిగారు. అయితే పోలీసులు రాకతో వివాదం సద్దుమణిగింది. ఇరు వర్గాలకు సర్దిచెప్పి అక్కడినుండి పంపించారు పోలీసులు. 

విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని షిర్డీ సాయిబాబా మందిర ప్రాంగణంలో నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బిజెపి, జనసేన పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని నిరసనకు దిగడం, స్థానిక వైసిపి నాయకులు వారిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. 

వీడియో

"