సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సైకో దర్శకుడు అని టీడీపీ మహిళా నేత సాధినేని యామిని ఆరోపించారు. ఆర్జీవీ ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరిట సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా తెలంగాణలో ప్రదర్శించినప్పటికీ... ఏపీలో మాత్రం ప్రదర్శించలేదు. 

ఈ క్రమంలో ఆయన న్యాయ పోరాటం చేయగా.. మే 1న విడుదల చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో..  ఆయన ఏపీలో మూవీ రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ పెట్టాలని భావించారు. దానిని పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ వ్యవహారమంతటిపై సాధినేని యామిని స్పందించారు. ఆర్జీవీ సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాగా.. ఆర్జీవీ మద్దతు పలుకుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం విదితమే. తనపై ఎవరైనా ఒక్క కామెంట్ చేసినట్లు తెలిసినా.. కౌంటర్ ఇచ్చే వర్మ.. యామిని మాటలకు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇదిలా ఉండగా... రేపు కూడా సినిమా విడుదల కష్టమనే వాదనలు వినపడుతున్నాయి