వైసీపీ ఎంఎల్ఏ దెబ్బకు చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి దిమ్మ తిరిగింది. రూ. 20 కోట్లకన్నా విలువ చేయదని ప్రభుత్వం చెబుతున్న భూములకు సోమవారం బహిరంగ వేలంలో ఏకంగా రూ. 60.30 కోట్లు పలికింది. అంటే ఏ స్ధాయిలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందో అర్ధమైపోతోంది.
వైసీపీ ఎంఎల్ఏ దెబ్బకు చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి దిమ్మ తిరిగింది. రూ. 20 కోట్లకన్నా విలువ చేయదని ప్రభుత్వం చెబుతున్న భూములకు సోమవారం బహిరంగ వేలంలో ఏకంగా రూ. 60.30 కోట్లు పలికింది. అంటే ఏ స్ధాయిలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందో అర్ధమైపోతోంది. వందల కోట్లరూపాయలు విలువైన భూములను కారుచౌకగా అంటే, రూ. 20 కోట్లకే తన మద్దతుదారులకు కట్టబెట్టేయాలన్న చంద్రబాబు ఉద్దేశ్యాన్ని ఆళ్ళ బహిరంగంగా ఎండగట్టారు. ఎంతో విలువైన సదావర్తి సత్రం భూములను చంద్రబాబు తన మద్దతుదారుడైన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్యకు కేవలం రూ. 20 కోట్లకే ఎవరికీ తెలీకుండా కట్టబెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పసిగట్టిన వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెంటనే ఆ విషయమై కోర్టుకెక్కారు. ఇక, అప్పటి నుండి జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.
బహిరంగ వేలం ద్వారా మాత్రమే అదికూడా జాతీయస్ధాయిలో ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతోనే ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా వేలంపాటను ఆపుచేయించాలని ఎంతో ప్రయత్నం జరిగింది. కోర్టు గట్టిగా నిలబడటంతో చివరకు బహిరంగ వేలం నిర్వహించక తప్పలేదు ప్రభుత్వానికి. చివరకు కేసు సుప్రింకోర్టుకు చేరింది. దాంతో చెన్నైలో ఈరోజు వేలం జరిగింది అనేకమంది వేలంపాటలో పాల్గొన్నప్పటికీ కడపకు చెందిన బిల్డర్ సత్యనారాయణరెడ్డి మొత్తం 83 ఎకరాలను రూ. 60.30 కోట్లకు సొంతం చేసుకున్నారు. అంటే ప్రభుత్వం అప్పనంగా కొట్టేదామనుకున్న ధరకన్నా మూడురెట్లు వేలంపాటలో ఎక్కువచ్చింది. ఈనెల 22వ తేదీన సుప్రింకోర్టులో విచారణకు రానున్నది.
