Asianet News TeluguAsianet News Telugu

చైర్మెన్, డైరెక్టర్ల ఆరోపణలు: శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డిపై బదిలీ వేటు

శాప్  ఎండీ ప్రభాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం  బుధవారం నాడు బదిలీ చేసింది. ఆయనను  జీఏడీలో  రిపోర్టు చేయాలని  ప్రభుత్వం ఆదేశించింది.

SAAP MD Prabhakar Reddy Transferred
Author
First Published Feb 8, 2023, 10:04 AM IST

అమరావతి: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  ఎండీ  ప్రభాకర్ రెడ్డిని  రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.  ఈ మేరకు  బుధవారం నాడు  ఉత్తర్వులు జారీ చేసింది.  జీఏడీలో  రిపోర్టు చేయాలని  ఆయనను ప్రభుత్వం  ఆదేశించింది. 

శాప్  బోర్డు సమావేశం  మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో  శాప్  ఎండీ ప్రభాకర్ రెడ్డి తీరుపై  చైర్మెన్  బైరెడ్డి సిద్దార్థరెడ్డి,  డైరెక్టర్లు అసంతృప్తిని వ్యక్తం  చేశారు.  సమస్యలు పరిష్కరించడం లేదని  ఆగ్రహం వ్యక్తం  చేశారు. పలుమార్లు  ఈ విషయాలను  ఎండీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టీ పట్టనట్టు వ్యవహరించడంపై  శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డిపై ఈ సమావేశంలో  బోర్డు  సభ్యులు  ఆగ్రహం వ్యక్తం  చేశారు. 

తనపై  శాప్  చైర్మెన్ , డైరెక్టర్లు చేసిన ఆరోపణలను   ఎండీ ప్రభాకర్ రెడ్డి  తోసిపుచ్చారు.  తనపై  చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా  ఆయన పేర్కొన్నారు. గతంలో  కంటే  ఎక్కువగా  క్రీడాకారులకు  శిక్షణ కోసం  క్యాంపులు ఏర్పాటు చేసినట్టుగా  ఎండీ  ప్రభాకర్ రెడ్డి తెలిపారు.  

తాను అవినీతి చేసినట్టుగా  ఆధారాలుంటే  ఫిర్యాదు  చేసుకోవాలని  ప్రభాకర్ రెడ్డి  సవాల్  విసిరారు.  తనపై బురదచల్లే ప్రక్రియలో భాగంగానే ఆరోపణలు  చేశారని  ప్రభాకర్ రెడ్డి చెప్పారు. 

నిన్ననే  శాప్  ఎండీపై  చైర్మెన్ సహ  బోర్డు సభ్యులు విమర్శలు చేశారు. వారి  విమర్శలకు  ఎండీ ప్రభాకర్ రెడ్డి  కూడా కౌంటర్  ఇచ్చారు.  ఈ తరుణంలో  శాప్  ఎండీ ప్రభాకర్ రెడ్డిని  ప్రభుత్వం  బదిలీ చేసింది.  ప్రభాకర్ రెడ్డి ని జీఏడీలో  రిపోర్టు చేయాలని  ఆదేశించింది.   సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ కు  శాప్  ఎండీగా  అదనపు బాధ్యతలు  కేటాయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios