గిడ్డి ఖరీదు రూ. 25 కోట్లా ?

గిడ్డి ఖరీదు రూ. 25 కోట్లా ?

తాజాగా వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏకు చంద్రబాబునాయుడు రూ. 25 కోట్లు ఖరీదు కట్టారా? సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడు సమక్షంలో పాడేరు ఎంఎల్ఏ తన మద్దతుదారులతో కలిసి టిడిపి కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఎంఎల్ఏ అలా కండువా కప్పుకున్నారో లేదో ఫిరాయింపు ఖరీదు రూ. 25 కోట్లంటూ ప్రచారం మొదలైపోయింది. అదికూడా టిడిపి వర్గాల నుండే కావటంతో అందరూ షాక్ తిన్నారు. సరే, జరుగుతున్న ప్రచారాన్ని గిడ్డి ఖండించారనుకోండి అది వేరే సంగతి.

సరే, ఈ ఖరీదులన్న మాట గిడ్డితోనే మొదలుకాలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. గతంలో కూడా చాలా మంది ఫిరాయించినపుడు ఈ ఖరీదుల విషయంపై చర్చ జరిగింది. గిడ్డికన్నా ముందు ఫిరాయించిన చోడవరం ఎంఎల్ఏ వంతల రాజేశ్వరి ఆమధ్య మాట్లాడుతూ తనకు టిడిపి వాళ్ళు రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పిన మాటలు అప్పట్లో సంచలనం. తనకు డబ్బుకన్నా పార్టీ, విలువలే ముఖ్యమని పెద్ద కబుర్లే చెప్పారు. తర్వాత ఏమైందో తెలీదు కానీ ఈమధ్యే పార్టీ ఫిరాయించారు.

అదేవిధంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, తనకు డబ్బు ఆఫర్ ఇవ్వలేదు కానీ మంత్రి పదవిని మాత్రం ఆఫర్ ఇచ్చినట్లు బహిరంగంగానే చెప్పారు. ప్రకాశం జిల్లా అద్దంకి వైసిపి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. టిడిపి ఎంఎల్సీ కరణం బలరాం మాట్లాడుతూ, రూ. 200 కోట్ల పన్నులను ఎగొట్టేందుకే గొట్టిపాటి టిడిపిలోకి మారినట్లు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది.

తాను టిడిపిలో చేరితే రూ. 30 కోట్లిస్తానని చంద్రబాబు చెప్పినా ఊరికే టిడిపిలో చేరినట్లు బికాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ చెప్పారు. అప్పలు తీర్చుకోవటానికి చంద్రబాబు వద్ద రూ. 10 కోట్లకు బేరం మాట్లాడుకుని అనంతపురం జిల్లాలోని కదిరరి నియోజకవర్గం వైసిపి ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష టిడిపిలోకి చేరినట్లు సాక్ష్యాత్తు టిడిపి నేతలే బాహాటంగా చెప్పారు. ఇలా ఒక్కో ఎంఎల్ఏది ఒక్కో యవ్వారం. మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే, అవసరాలను గమనించి ఎవరికి కావాల్సింది వారికి చంద్రబాబు ఎరేస్తున్నారు. అది డబ్బు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, పదవులూ కావచ్చు. చంద్రబాబు చెప్పే విలువలతో కూడిన రాజకీయమంటే ఇదేమరి.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos