కర్నూల్: కర్నూల్ జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ గా పనిచేస్తున్న విష్ణునారాయణ వాట్సాప్ మేసేజ్ కలకలం సృష్టించింది. .ఈ మేసేజ్ చదివే సమయానికి  తాను బతికే అవకాశం లేదని ఆయన  ప్రకటించారు. ఆదివారం నాడు ఉదయం నుండి  ఆయన అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు కూడ ఆందోళన చెందుతున్నారు.

కర్నూల్ జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్‌‌లో ఎస్ఐ గా పనిచేస్తున్న విష్ణు నారాయణ  శనివారం నాడు అర్ధరాత్రి పోలీసు అధికారిక గ్రూపులో వాట్సాప్ మేసేజ్ పెట్టారు. ఈ మేసేజ్ చదివే సమయానిక తాను బతికి ఉండననిప్రకటించారు. 

Also read:గద్వాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ: మరో ప్రియుడితో కార్తీక్ హత్య, ప్రియురాలు సూసైడ్

ఈ మేసేజ్ చూసిన వెంటనే ఆళ్లగడ్డ డీఎస్పీ విష్ణునారాయణ వద్దకు వెళ్లి ఆయనను సముదాయించారు. ఆ తర్వాత ఆళ్లగడ్డ డిఎస్పీ విష్ణు నారాయణ ఇంటి నుండి వెళ్లిపోయారు.

ఆదివారం నాడ తెల్లవారుజామున ఉదయం  విష్ణు నారాయణ తన ఇంటి నుండి కారులో నుండి బయటకు వెళ్లారు.   విష్ణు నారాయణ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

విధుల్లో నిర్లక్ష్యం వహించారనే నెపంతో విష్ణు నారాయణపై  ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయమై ఆయనపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.  

ఓ కేసు విషయంలో  ఉన్నతాధికారులు పనిష్‌మెంట్ ఇచ్చారని  విష్ణు నారాయణ తన కుటుంబసభ్యులకు చెప్పి బాధపడినట్టుగా వారు చెబుతున్నారు. ఎస్ఐ విష్ణు నారాయణ ప్రయాణించిన కారు చాగలమర్రి టోల్‌గేట్ వద్ద నుండి వెళ్లినట్టుగా పోలీసులు సీసీటీవీ పుటేజీని పోలీసులు గుర్తు చేశారు.