జన సేన నాయకులుగా చెలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తులు తిరుపతిలో రెచ్చిపోయారు. రాజారెడ్డి, ఆటోనగర్ జిత్తు అనే ఈ ఇద్దరు తిరుపతిలోని ఒక లాడ్జి మేనేజర్ కు ఫోన్ చేసి ఎసి రూమ్ కావాలని అడిగారు. ఎసి రూమ్ ఖాళీ లేదని లాడ్జి మేనేజర్ బదులిచ్చారు. దీంతో వారిద్దరికీ కోపమొచ్చి లాడ్జికి వచ్చి మేనేజర్ ను బూతులు తిట్టడమే కాదు చేయి చేసుకున్నారు. లాడ్జి మేనేజర్ ను కొట్టిన వీడియోలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

"

బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరో వైపు కేసు రాజీ చేసుకోమంటూ ఈస్ట్ సిఐ ఉచిత సలహా ఇస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కేసు ఫైల్ చేయకపోతే తాను అంబేద్కర్ విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నాడు లాడ్జి మేనేజర్. వీడియో పైన ఉంది చూడండి.