చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రిటైర్డ్ ఎస్పీజీ అధికారి.. ఎవరీ పీసీ స్వామి..?

చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి, మాజీ ఎస్పీజీ కమాండెంట్ పీసీ స్వామి తెలుగుదేశం పార్టీలో చేరారు . సీ స్వామి గతంలో ప్రధాన మంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ కమాండెంట్‌గా పనిచేశారు.

rtd spg officer pc swamy joined in telugu desam party in front of chandrababu naidu ksp

చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి, మాజీ ఎస్పీజీ కమాండెంట్ పీసీ స్వామి తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వామి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ కండువా కప్పి పీసీ స్వామిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీకి సేవ చేస్తానని పీసీ స్వామి తెలిపారు. ఇకపోతే.. పీసీ స్వామి గతంలో ప్రధాన మంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ కమాండెంట్‌గా పనిచేశారు. 33 ఏళ్ల సర్వీస్‌లో ఎనిమిది మంది ప్రధానులకు సేవలందించారు. తొలి నుంచి చంద్రబాబు నాయుడు విజన్, పాలనను పీసీ స్వామి అభిమానించేవారు. 

అంతకుముందు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు . ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో జగన్ ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. అన్న తినే వారెవరూ జగన్‌కు ఓటేయరని పేర్కొన్నారు. జగన్ తన సొంత బాబాయిని చంపేశాడని ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తికి ఓటు ఎవరూ వేయరని అన్నారు. నాలుగేళ్లుగా నరకాన్ని అనుభవిస్తున్నామని, అమ్మ ఒడి పథకం ఒట్టి బూటకమని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.

ALso Read: పులివెందులలో జగన్‌కు ఓటమి ఖాయం.. సొంత బాబాయిని చంపాడు: చంద్రబాబు

జగన్ ప్రభుత్వం పేదలపై రూ. 51 వేల కోట్ల మేరకు విద్యుత్ భారం వేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరెంట్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. టమాట ధర కిలోకు రూ. 200కు పెరిగిందని పేర్కొంటూ తాను టీడీపీ హయాంలో ధరలను నియంత్రించామని వివరించారు. ఉల్లిపాయల ధరలు పెరిగితే వాటిని నాసిక్ నుంచి తెప్పించానని గుర్తు చేశారు. 

ఫిష్ మార్కెట్ పెట్టి ఉద్యోగాలు సృష్టించానని చెప్పే సీఎం ఒక్క జగనే అని విమర్శించారు. అంతేకాదు, చెత్తపై చెత్త పన్ను వేసిన చెత్త సీఎం కూడా ఆయనే అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యేటా మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని వివరించారు. తల్లికి వందనం పథకం తెచ్చి ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ యేటా రూ. 15 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. అంతేకాదు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని వివరించారు. పేదలను ధనికులను చేయడానికి పూర్ టు రిచ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios