అమరావతి: ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 13 వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ ప్రకటించింది.  గురువారం నాడు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఎసీ ఈ నెల 13వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి చర్చలు జరిగాయి.ఆ చర్చలు విఫలమయ్యాయి. వైఎస్ జగన్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ జేఎసీతో ఆర్టీసీ యాజమాన్యం చర్చించింది.ఇవాళ చర్చలు విపలమయ్యాయి.

ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేని కారణంగా చర్చలు ఫలవంతం కాలేదని యాజమాన్యం చెబుతోంది.  ఎండీ అందుబాటులో లేకపోయినా ఎందుకు చర్చలకు ఆహ్వానించారని జేఎసీ నేతలు ప్రశ్నించారు.  ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదని జేఎసీ నేతలు చెప్పారు.

ఈ నెల 9వ తేదీ నుండి కార్మికులు ఎవరూ కూడ అదనపు డ్యూటీలు చేయరని ఆయన చెప్పారు. ఈ నెల 12 వ తేదీ నుండి దూరప్రాంత సర్వీసులను నిలిపివేస్తామని జేఎసీ స్పష్టం చేసింది.