ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా కలియుగ కీచకుల్లో కొంచెం కూడా మార్పు రావడం లేదు. మహిళ కనపడితే చాలు.. కామంతో చూసేవారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. తాజాగా.. ఓ మహిళా ఉద్యోగిని పట్ల ఉన్నతస్థాయి అధికారి నీచంగా ప్రవర్తించాడు. డ్యూటీ దిగగానే.. తన గదికి రావాలంటూ నీచంగా మాట్లాడాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్టీసీ డిపోలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు డిపోలోని మ‌హిళల‌ ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారితో అసభ్య చాటింగ్‌లు చేయడమే కాకుండా.. డ్యూటీ దిగాక తన ఆఫీస్‌కు వచ్చి వెళ్లాలని ఆదేశాలు కూడా జారీచేశారు. సెలవు కావాలంటే కోరిక తీర్చాల్సిందేనని పశువులా ప్రవర్తించాడు. వయసుతో సంబంధం లేకుండా తను చెప్పిందే చేయాల్సిందేనని ఒత్తిడికి గురిచేశాడు. 

తాను చెప్పినదానికి ఒప్పుకుంటే లాంగ్‌ డ్రైవ్‌లు, టూరిస్ట్‌ ప్లేస్‌లు తిప్పుతానని ఎర వేసే ప్రయత్నం చేశాడు. తన కోరిక తీర్చకపోతే ప్రమోషన్‌ లిస్ట్‌లో పేర్లు లేకుండా చేస్తానని బెదిరింపులుకు పాల్పడ్డాడు. అయితే ఈశ్వరరావు వ్యవహారం డైరెక్టర్‌ స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే ఈశ్వరరావు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో మహిళా ఉద్యోగులు ఒక్కక్కొరిగా బయటకు వచ్చి అతడి బండరాన్ని బయటపెట్టారు. ఆ  కీచకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.