ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం  పోలీస్ స్టేషన్ లో రూ, 8 లక్షల నగదు చోరీకి గురికావడం చర్చకు దారితీసింది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుసగా బ్యాంకులకు సెలువు లు రావడంతో ఎక్సైజ్ పోలీసులు వీరవాసరం  పోలీస్ స్టేషన్ లో రూ. 8 లక్షల నగదును దాచారు.నాలుగు వైన్ షాపులకు సంబంధించిన నగదు రూ. 8లక్షల నగదును వీరవాసరం  పోలీస్ స్టేషన్ లో దాచారు. అయితే ఈ నగదు కోసం వచ్చిన ఎక్సైజ్ పోలీసులకు షాక్ కు గురైంది.

రూ. 8 లక్షల నగదు కన్పించకుండాపోయింది.ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పోలీస్ స్టేషన్ లో దాచిన నగదు ఎలా మాయమైందనే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.