ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సర్పంచ్ పదవికి వేలంపాట జరిగింది. మండలంలోని రాజపూడి గ్రామంలో జరిగిన ఈ వేలంపాటలో సర్పంచ్ పదవిని ఓ వ్యక్తి రూ. 52 లక్షలకు పాడుకున్నాడు.

వేలంపాటలో పాడుకున్నా అతను ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని గ్రామపెద్దలు ఆ వ్యక్తికి తెలిపారు. అంతేకాదు పాడుకున్న వ్యక్తికి ఎన్నికల్లో గ్రామస్తులంతా మద్దతు ఇచ్చేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
ఒకవేళ ఏదైనా జరిగి వేలంపాటలో పదవి కొనుక్కున్న వ్యక్తి ఓడిపోతే వేలంపాట పాడిన డబ్బులు అతను కట్టనక్కరలేదు. గెలిస్తే మాత్రం రూ.52 లక్షలు కట్టేలాగా ఒప్పందం రాసుకున్నారు.