పోలవరంపై ఇప్పటికీ రూ. 13, 463 కోట్లు రీయంబర్స్: కేంద్రం
పోలవరం ప్రాజెక్టుకు రూ.13, 463 కోట్లు రీయంబర్స్ చేసినట్టుగా కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసింది.
అమరావతి:2014-2023 మధ్య పోలవరానికి రూ. 13, 463 కోట్ల రీయంబర్స్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ఆర్టీ ఐ కార్యకర్త రమేష్ చంద్రవర్మ సమాచారం కోరారు. ఆర్టీఐ చట్టం కింద ఆయన సమాచారం అడిగారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ ఆర్టీఐ కార్యకర్త రమేష్ కు సమాచారం అందించింది.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకముందు రాష్ట్రం చేసిన ఖర్చు రూ. 4,730 కోట్లు. ఖర్చు చేసిందని ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తన సహయంగా ఇవ్వాల్సింది రూ. 15,667 కోట్లుగా తేల్చింది. 2023 మార్చి 31 వరకు రూ.14, 418 కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రకటించింది.
సాగునీటి కాంపొనెంట్ కింద రూ. 1249 కోట్లు ఇవ్వాలని కోరారు.