కాపు ఉద్యమ నేత ముద్రగడను కలసిన మాజీ సీఎం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య మళ్లీ క్రీయాశీల రాజకీయాల్లోకి రానున్నారా...అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నాక గాంధీ భవన్ వైపే రాకుండా ఇన్నాళ్లు క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న రోశయ్య సడన్ గా శనివారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలుసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ నివాసానికి స్వయంగా వచ్చిన రోశయ్య ఆయనతో చాలా సేపు భేటీ అయ్యారు.
అయితే ముద్రగడ తనకు మిత్రుడని, జిల్లాకు వచ్చినందునే చూసి పోదామని వచ్చానని రోశయ్య వివరణ ఇచ్చారు. తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.
