ఓ పేద కుటుంబాన్నిమంత్రి రోజా సర్ ప్రైజ్ చేశారు. శాంతాక్లాజ్ వేషధారణలో వెళ్లి బోలెడన్ని గిఫ్టులిచ్చారు ఆ కుటుంబానికి కావాల్సి ఆర్థికసాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

అమరావతి : వైసీపీ ఎమ్మెల్యే, పర్యాటక, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రి రోజా ఓ పేద కుటుంబానికి సర్ ఫ్రైజ్ ఇచ్చింది. శాంతాక్లాజ్ వేషధారణలో వారి దగ్గరికి వెళ్లి వారిని సంతోపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఓ నిరుపేద కుటుంబానికి ఈ రకంగా సహాయం చేశారు. గత మూడేళ్లుగా వైఎస్ జగన్ పుట్టినరోజున ఏదో ఒక ప్రత్యేకంగా చేసే రోజా ఈ సారి ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు.

దీనిమీద ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ రోజు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగగనన్న పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకం అని. ప్రతీ యేటా జగనన్నను ప్రేమించే, అభిమానించే కుటుంబానికి సాయం చేయాలనుకుంటానని అన్నారు. వారి ఆశిస్సులు జగనన్నకు ఉండాలి అనే ఆకాంక్షతో వారిని సాయం చేస్తుంటానని తెలిపారు. 

వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే .. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం : జగన్‌కు చంద్రబాబు హెచ్చరిక

అలాంటి వారిని వెతికి పట్టుకుని హెల్ప్ చేస్తానన్నారు. గతంలో పుష్ప అనే అమ్మాయిని దత్తత తీసుకుని మెడిసిన్ చదివిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆ తరువాత మీరాసపాలెం అనే గ్రామాన్నిదత్తత తీసుకుని గ్రామానికి కావాల్సి వసతులు ఏర్పాటు చేశాను. 

ఈసారి నాగరాజు కుటుంబానికి సాయం చేశాను. దీనికి మోహన్ అనే జర్నలిస్ట్ సహకరించారు. మా నాన్న పేరు నాగరాజు.. ఆయనంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన కోసమే నేను ఇష్టం ఉన్నా, లేకున్నా సినిమాల్లోకి వచ్చాను. దీంతో అతని పేరుతో నేను బాగా కనెన్ట్ అయ్యాను. అందుకే నాగరాజు కుటుంబానికి అండగా నిలబడతానని హామీ ఇచ్చాను.

అతనో షాప్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం చేశాను. పిల్లలు చదువుకోవడానికి సహకారం అందిస్తానని చెప్పాను. నాగరాజు అంగవికలుడు, భార్య కిడ్నీ బాధితురాలు.. ఆమెకు కావాల్సిన సహాయాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు. నేను నాగరాజు అనే పేరుతో కనెక్ట్ అవ్వడం వల్లేనేమో.. నా పీఏ వెళ్లాల్సిన ప్లేసులో నేను శాంత క్లాజ్ గా వెళ్లే అవకాశం దొరికింది. ఈ రోజే నాకు ఇక్కడ జగనన్నతో కలిసే మీటింగ్ ఉండడం వల్ల ఇది సాధ్యం అయ్యింది అని సంతోషంగా చెప్పుకొచ్చారు. విలువైన బహుమతి కన్నా, విలువలతో కూడిన బహుమతి ఇవ్వండి అదే జగనన్నకు శ్రీరామరక్ష అంటూ చెప్పుకొచ్చారు రోజా.