మనవాళ్లు బ్రీఫ్ డీ మీ చంద్రబాబుదే, జైలు తప్పదు: రోజా

Roja says the voice is of Chandrababu Naidu's
Highlights

ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ర్యాలీలు, ధర్మపోరాటాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా అన్నారు. 

అమరావతి: ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ర్యాలీలు, ధర్మపోరాటాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా అన్నారు. జైలు పాలు కావాల్సి ఉంటుందని ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా,త మహిళలూ ఆడపిల్లల రక్షణ గురించి ఏ రోజు కూడా పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు కొత్త నాటకం ఆడుతున్నారని అన్నారు. 

నిరుడు అంతర్జాతీయ మహిళా సదస్సుకు వచ్చిన రోజాను విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించడంపై గన్నవరం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు కోసం ఆమె బుధవారం వచ్చారు. విమానాశ్రయయంలో, కోర్టు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎసిబీ సమావేశం పెడితే ఇక్కడ చంద్రబాబు ఎలా వణుకుతున్నారో అందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్లు మంత్రి సోమిరెడ్ిడ, కంభంపాటి, వర్ల రామయ్య మాట్లాడడం చూస్తుంటే ఆ పార్టీకి ఓటుకు నోటు కేసు భయం పట్టుకుందని అర్థమవుతోందని అన్ారు. 

తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణలో మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనని చండీగడ్ ఫోరెన్సిక్ నివేదిక తేల్చిందని అన్నారు.  

loader