శిల్పను అలా అంటారా, లోకేష్ ఎందుకు పరామర్శించలేదు: రోజా

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 10, Aug 2018, 10:26 PM IST
Roja reacts on Medico Shilpa suicide
Highlights

డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా స్పందించారు. శిల్పను సైకో అనడం దారుణమని ఆమె అన్నారు. శిల్పది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యేనని ఆమె విమర్శించారు. 

తిరుపతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా స్పందించారు. శిల్పను సైకో అనడం దారుణమని ఆమె అన్నారు. శిల్పది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యేనని ఆమె విమర్శించారు. 

శిల్ప కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేశ్ సహా ఎవరూ ఇంతవరకూ పరామర్శించలేదన్నారు. చదువుకునే మహిళలకు కూడా టీడీపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆమె అన్నారు.
 
తాను శిల్పా కుటుంబ సభ్యులను పరామర్శించానని, అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె అన్నారు. గవర్నర్‌కు లేఖ రాసిందన్న కోపంతోనే ప్రొఫెసర్లు మెడికో శిల్పపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. 

ప్రభుత్వం ప్రొఫెసర్లను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. శిల్ప ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

loader