చంద్రబాబుపై రోజా ఫైర్

Roja fires on Naidu over vizag land scam
Highlights

గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటన, ఎంఆర్ఓ వనజాక్షిపై ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ దాడి, ఓటుకునోటు తదితరాలపై ప్రభుత్వం వేసిన విచారణ కమిటీలు ఏమయ్యాయని నిలదీసారు. ఇపుడు విశాఖపట్నం భూకుంభకోణంపై సిట్ విచారణ కూడా అంతేనని ఎద్దేవా చేసారు. కాబట్టే తాము సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పై వైసీపీ ఎంఎల్ఏ రోజా ఫైర్ అయ్యారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, సిబిఐ విచారణ చేయిస్తే తండ్రి, కొడుకులకు జీవితకాలం జైలే గతి అని అన్నారు. విశాఖపట్నంలో భారీ ఎత్తున జరిగిన భూకుంభకోణంపై అందరూ అడుగుతున్నట్లు చంద్రబాబు సిబిఐ విచారణ ఎందుకు చేయించటం లేదని నిలదీసారు. రాష్ట్రలో జరుగుతున్న భూకుంభకోణాల వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తముందని అందరూ అనుమానిస్తున్నట్లు రోజా ఆరోపించారు.

గంటా శ్రీనివాసరావు, దీపక్ రెడ్డిలు పాల్పడుతున్న భూకుంభకోణాలు, అక్రమాల్లో చంద్రబాబుకు భాగముంది కాబట్టే వాళ్ళపై చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. విశాఖ జిల్లాలో జరిగిన భూకుంభకోణంలో కీలక పాత్రదారుడు గంటానే తాజాగా సిబిఐ విచారణకు డిమాండ్  చేయటం ప్రభుత్వ నాటకంలో భాగమే అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ‘సిట్’ తో ఎటువంటి ఉపయోగం లేదని చెప్పారు. సిట్ ను కోరలు లేని పాముగా రోజా వర్ణించారు.

గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటన, ఎంఆర్ఓ వనజాక్షిపై ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ దాడి, ఓటుకునోటు తదితరాలపై ప్రభుత్వం వేసిన విచారణ కమిటీలు ఏమయ్యాయని నిలదీసారు. ఇపుడు విశాఖపట్నం భూకుంభకోణంపై సిట్ విచారణ కూడా అంతేనని ఎద్దేవా చేసారు. కాబట్టే తాము సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అక్రమార్కులతో చేతులు కలపటం వల్లే లోకేష్ ఆస్తులు వందలరెట్లు పెరిగాయా అని అనుమానం వ్యక్తం చేసారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించిన మగాడు వైఎస్ఆర్ అంటూ చంద్రబాబు-వైఎస్ మధ్య తేడాను విప్పిచెప్పారు.

 

loader