ఉగ్రరూపం చూపిస్తానని.. వంగి వంగి సలామ్ చేశారు

First Published 18, Jun 2018, 6:20 PM IST
Roja Fires On chandrababu naidu
Highlights

ఉగ్రరూపం చూపిస్తానని.. వంగి వంగి సలామ్ చేశారు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఫైర్‌బ్రాండ్, ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఇవాళ శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల విషయంలో మోడీని నిలదీస్తానని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెబుతానని చెప్పిన చంద్రబాబు.. ఢిల్లీలో మోడీని చూడగానే ఆయనకు వంగి వంగి సలాములు చేశారని విమర్శించారు. సీఎం పోరాటాలు చేసే వ్యక్తి కాదని.. ఆయన ఒక అవకాశవాదని.. అందితే జుట్టు లేకుంటే... కాళ్లు పట్టుకునే వ్యక్తని రోజా ఆరోపించారు.. ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న చంద్రబాబు అక్కడికి వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రధానికి సలాములు చేసేందుకే ఢిల్లీ వెళ్లారని.. మోడీని కలిసిన సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో ఓ పక్క భయం.. మరో పక్క పిచ్చి నవ్వు కనిపించందని ఎద్దేవా చేశారు.. ఒలంపిక్స్‌లో వంగి నమస్కారాలు పెట్టే పోటీ పెడితే చంద్రబాబు మొదటి బహుమతి సాధిస్తారని రోజా అన్నారు.

loader