ప్రజలు మంగళగిరిలో లోకేష్, కుప్పంలో బాబు మెడలు వంచారు : రోజా

సీఎం జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అంశంపై కార్మిక సంఘాలతో మాట్లాడి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన 23 కిలోమీటర్ల పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. శనివారం ఉదయం విశాఖ GVMC గాందీ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.   

roja fires on chandrababu, lokesh over visakha steel plant privatisation - bsb

సీఎం జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అంశంపై కార్మిక సంఘాలతో మాట్లాడి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన 23 కిలోమీటర్ల పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. శనివారం ఉదయం విశాఖ GVMC గాందీ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.   

ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ లోక్ సభలో, రాజ్యసభలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలే వాయిస్ రైజ్ చేస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అని, ఎంతోమంది త్యాగ ఫలం అని గుర్తు చేశారు. అందుకే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారని ఆర్కే రోజా అన్నారు. 

ఆయన ఆశయం గొప్పది కాబట్టే.. అందరం ఇక్కడకు వచ్చి మద్దతు పలుకుతున్నామని అన్నారు. చంద్రబాబు విశాఖ వచ్చి ఏదో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకమని చెప్పి.. గతంతో వారితోనే బాబు చేతులు కలిపాడని అన్నారు. 

అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రి గా ఉన్నాప్పుడే   స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అడుగులుపడ్డాయని విమర్శించారు. టీడిపి వాళ్లకి ఓ క్లారటీ అన్నదే లేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని, విషయం తెలిసినా గత ప్రభుత్వం దీనిపై ఏం చేసిందని ప్రశ్నించింది. 

స్టీల్ ప్లాంట్ అంశంపై చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదు?, చంద్రబాబు అండ్ కో చేసీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరు అని ధ్వజమెత్తారు. అందుకే కుప్పం నుంచి చంద్రబాబుని పంచాయితీ ఎన్నికలో తరిమి కొట్టారన్నారు. 

వైసీపీ మీద పడి ఏడ్చే చంద్రబాబు ప్రజలకు చెప్పిందొకటి చేసిదొకటి అన్నారు.  ఇలాంటి మాట్లలుచెప్పబట్టే ఇలాంటి అనుభవాలు ఆయనకు ఎదురవుతున్నాయన్నారు. లోకేష్ విశాఖకు వచ్చి అందరి మెడలు వంచుతామని మాట్లాడుతున్నాడు.

మంగళిగిరిలో నీకు, కుప్పంలో మీ నాన్నకు ప్రజలు మెడలు వంచారు. ఇంకా ఎక్కువ చేస్తే విశాఖ కార్పోరేషన్ ఎన్నికలో బుద్ది చెబుతామని మండిపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios