తన వ్యక్తి స్వేచ్చను పోలీసులు హరించారంటూ డిజిపి, ఏసిపిలను బాధ్యులను చేస్తూ రోజా దాఖలు చేసిన కేసును కోర్టు విచారణకు స్వీకరించింది.
వైసీపీ ఎంఎల్ఏ రోజా న్యాయపోరాటం మొదలుపెట్టారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరుకానీయకుండా తనను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ రోజా గన్నవరం కోర్టులో కేసు వేసారు. సదస్సులో హాజరయ్యేందుకు తనకు స్సీకర్ ఆహ్వానం పంపినా పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారంటూ ఆరోపించారు. తన వ్యక్తి స్వేచ్చను పోలీసులు హరించారంటూ డిజిపి, ఏసిపిలను బాధ్యులను చేస్తూ రోజా దాఖలు చేసిన కేసును కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
