Asianet News TeluguAsianet News Telugu

ఆ చెప్పులనే నెత్తిన మోస్తున్నారు: రాహుల్ తో బాబు దోస్తీపై రోజా

ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి, పదవుల కోసం ఎంతకైనా దిగజారే సీఎం దేశంలోనే ఎక్కడా లేరని ఒక్క చంద్రబాబు తప్ప అంటూ రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. 

Roja criticises Chandrababu on allaince with Congress
Author
Eluru, First Published Dec 1, 2018, 3:07 PM IST


ఏలూరు: ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి, పదవుల కోసం ఎంతకైనా దిగజారే సీఎం దేశంలోనే ఎక్కడా లేరని ఒక్క చంద్రబాబు తప్ప అంటూ రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. 

శనివారం ఏలూరులో మీడియాతో మాట్లాడిన రోజా రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్తున్న టీడీపీని ఎక్కడ వరకు తరిమికొట్టాలని అని రోజా ప్రశ్నించారు. 

రెండు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీపై చెప్పులు వేయించిన చంద్రబాబు అవే చెప్పులను నెత్తిపై పెట్టుకుని తెలంగాణలో ఊరేగుతున్నారని మండిప్డడారు. అధికారం కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని రోజా ఘాటుగా విమర్శించారు. 

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుంటూరు పర్యటించినప్పుడు టమోటాలతో దాడి చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ దాడిని రాహుల్ గాంధీ మరచిపోయినా ప్రజలు మరచిపోలేదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ తో దేశ భవిష్యత్ కోసం, వ్యవస్థల బాగుకోసం పొత్తు పెట్టుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖకు రైల్వే జోన్ సాధించలేని చంద్రబాబు చవట దద్దమ్మ అంటూ తిట్టిపోశారు. రాష్ట్రానికి విభజన హామీలను సాధించలేని చంద్రబాబు దేశాన్ని ఉద్దరిస్తారా అంటూ ప్రశ్నించారు. 

వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి వ్యవస్థలను రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన చంద్రబాబు వ్యవస్థలు గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రం కరువుతో విలవిలలాడుతోందని రోజా చెప్పారు. ప్రత్యేక విమానాల్లో ఎక్కి ప్రచారాల పేరుతో ఊరేగుతుంటే ఏపీ నుంచి తరిమికొట్టాలా లేదా అని నిలదీశారు.  

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఎస్ జగన్ పై మాట్లాడటం సరికాదన్నారు. జగన్ బలహీనత అవినీతి అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం అతని అజ్ఞాన్ని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో దేశానికి వినాశనమే తప్ప న్యాయం జరగదన్నారు. 

ఓదార్పుయాత్రలో జగన్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక  కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు అయి ఎర్రన్నాయుడు, శంకర్రావు లతో రాజకీయ కక్ష సాధింపు కేసులు వేయించింది మీరు కాదా అని నిలదీశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అంటూ ఈ ఏడాది జూన్ 8న కాంగ్రెస్ చార్జీషీట్ విడుదల చేసిందని అది మరచిపోయారా అంటూ విమర్శించారు. అలాంటి రాహుల్ గాంధీ నేడు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని సిగ్గు లేదా అంటూ నిలదీశారు. 

అవినీతికి పట్టుకొమ్మలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఏకమై తెలంగాణలో పొత్తుతో ప్రజల ముందుకు వచ్చారని వారిని తిప్పికొట్టాలని రోజా పిలుపునిచ్చారు. ఇలాంటి అపవిత్ర పొత్తు ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రోజా అటు తెలంగాణ ప్రజలకు, ఇటు ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను వైసీపీని విమర్శించే అర్హత లేదని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఊర్లు తిరుగుతున్న చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి పవన్ జగన్ ను విమర్శించడం దురదృష్టకరమన్నారు. 

బ్యాంకులకు 6వేల కోట్లు టోపీ పెట్టుతున్న సుజనా చౌదరి కనిపించడం లేదా అని నిలదీశారు. బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్న టీడీపీని విమర్శించకుండా జగన్ ను విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న పార్టీలను విమర్శించడం మానేసి వైసీపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా జగన్ పై ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. పవన్ ఒకటి అంటే వంద అంటాం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios