జనసేన చీప్ పవన్ కల్యాణ్ చేసిన డైమండ్ రాణి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ను రోజా పోలిటికల్ జోకర్ గా అభివర్ణించారు. చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయని విమర్శించారు.
చిత్తూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ డైమండ్ రాణి వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ను పొలిటికల్ జోకర్ గా ఆమె అభివర్ణించారు. మంత్రిగా తొలి సంక్రాంతి జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయని ఆమె వ్యాఖ్యానించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

బాలక్రిష్ణకు వీరసింహారెడ్డి ద్వారా, చిరంజీవికి వాల్తేరు వీరయ్య ద్వారా కలెక్షన్లు వస్తే పవన్ కల్యాణ్ కు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ మాదిరిగా తాను ప్రజల మద్దతుతో పోటీ చేయలేనని, 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేనని పవన్ కల్యాణే చెబుకున్నారని రోజా అన్నారు.
వైఎస్ జగన్ పాలనలో రైతులంతా సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు తన చెత్త ఆలోచనలను భోగి మంటల్లో వేయాలని ఆమె అన్నారు.
