అనుచిత వ్యాఖ్యలు: బోడె ప్రసాద్ పై రోజా ఫిర్యాదు

Roja complains against TDP MLA Bode Prasad
Highlights

తెలుగుదేశం పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ పై వైఎస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున హైకోర్టు న్యాయవాది సుధాకర్‌రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. 

విజయవాడ: తెలుగుదేశం పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ పై వైఎస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున హైకోర్టు న్యాయవాది సుధాకర్‌రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. 

శనివారం పెనమలూరు సీఐ దామోదరరావు మీడియా ప్రతినిధులకు వివరాలు అందించారు. ఇటీవల కంకిపాడులో జరిగిన రోజా బహిరంగ సభనుద్దేశించి పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అర్థరహిత అనాలోచితమైన వ్యాఖ్యలు చేశారని, ఎమ్మెల్యేగా ఉంటూ దారుణమైన భాషను వాడడం రాజ్యాంగ విరుద్ధంగా భావించి, అతనిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలంటూ ఫిర్యాదు చేశారు.
 
రోజా ఆదేశాల మేరకు హైకోర్టు న్యాయవాది సుధాకర్‌రెడ్డి సీఐని కలిసి ఫిర్యాదుతో చేసి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాట్లాడిన సీడీని అందజేశారు. ఆ తర్వాత స్టేషన్‌ పరిధిలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ నినాదాలు చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా వైసీపీ నాయకులు తాతినేని పద్మావతి, జానామణి, మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై తప్పకుండా విచారణ చేపడతామని సీఐ దామోదరరావు హామీ ఇచ్చారు. దాంతో వారు ఆందోళన విరమించారు.

loader