కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ వద్ద 40వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు భక్తులు తిరుపతి, కాణిపాకం దర్శించుకుని మహానంది వస్తుండగా ఈ  ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఒకరు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.