శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేరళ వెళ్లి.. ఓ అయ్యప్ప భక్తుడు మృత్యువాతపడ్డాడు. బుధవారం ఉదయం కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

చిన్నమండెం మండలంలో చిన్నార్సుపల్లెకు చెందిన కొందరు అయ్యప్ప స్వాములు రెండు వాహనాలలో శబరిమలైకు వెళ్లారు. కాగా ఇందులో ఒక వాహనం అదుపుతప్పి లోయలో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన వల్లపు కృష్ణ(30) అక్కడికక్కడే మృతి చెందగా గోపాల్, వెంకటమ్మ, కృష్ణ, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.