Road Accident: హైదరాబాద్ లో మితిమిరిన వేగంతో కారు నడిపించి..బైకును ఢీ కొట్టడంతో .. బైకర్ ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు. అలాగే.. గుంటూరులో పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు.
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడపడం, మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో నిండు ప్రాణాలను కోల్పోతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకర సాఫ్ట్ వేర్ కాగా..మిగతా ముగ్గురు విద్యార్థులు.
తాజాగా.. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ లో ఇటీవలే ప్రారంభమైన కొత్త ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు.. బైక్‌ను ఢీకొంది. రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో.. బైక్ పై వెళ్తున్న యువకుడు ఫ్లై ఓవర్ పై నుంచి ఎగిరి కిందపడటంతో.. తల పగిలి స్పాట్‌లోనే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బైకర్ ను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో.. యువకుడు బ్రిడ్జి పై నుంచి పడి, తీవ్రగాయాలతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు పడి చనిపోయిన వ్యక్తిని కర్నూలు జిల్లాకు చెందిన భరద్వాజ్‌గా గుర్తించారు . మృతుడు.. నగరంలోని ఓ ప్రముఖ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో మితిమిరిన వేగంతో అర్థరాత్రి విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టడంతో.. ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని తిరిగి బైక్‌పై స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతులు పెనుమాకకు చెందిన షేక్ పై కంబర్, షేక్ రాజా, సతీష్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. షేక్ పై కంబర్ కు తీవ్ర గాయాలు కాపాడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందినట్లు గుర్తించారు. తీవ్రగాయాలైన సతీశ్‌రెడ్డి, ఎస్‌కే రాజులను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
