గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. లాలూపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా స్థానిక ఆర్‌వీఆర్ అండ్ జేసీ కళాశాలకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.