గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప స్వాములు దుర్మరణం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన దినేశ్, సారథి, సుబ్బారావే అనే యువకులు మాల వేసుకుని అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లారు.

దర్శనం పూర్తి చేసుకుని కారులో రాజమహేంద్రవరం వస్తుండగా చిలకలూరిపేట మండలం పాతపూడి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై  ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా... సోమశేఖర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలవ్వడంతో ఆయనను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో పాటు అతివేగం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు తెలిపారు.