తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. అన్నమయ్య జిల్లాలో ఘటన
కర్ణాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లి మండలంలో ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి.

లారీ- తుఫాన్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించిందని.. కసాయిగా మారిన కన్నతండ్రి.. ఏం చేశాడంటే ?
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావికి చెందిన పలువురు తుఫాన్ వాహనంలో తిరుమలకు వచ్చారు. అనంతరం తమ స్వరాష్ట్రానికి ప్రయాణం ప్రారంభించారు. అయితే ఆ వాహనం అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లి మండలం మఠంపల్లి సమీపానికి చేరుకుంది. అక్కడ ఆ వాహనం- లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి.
కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. తల్లిదండ్రుల ఆగ్రహం..
దీంతో తుఫాన్ వాహనంలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. 11 మందికి గాయాలు కాగా.. వారిని తిరుపతిలో ఉన్న రుయా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.