అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విడపనకల్లు (vidapanakal) మండలం డోనేకల్లు (donekal) గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఓ కారు నీటి గుంతలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు కుటుంబసభ్యులు వున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విడపనకల్లు (vidapanakal) మండలం డోనేకల్లు (donekal) గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఓ కారు నీటి గుంతలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు కుటుంబసభ్యులు వున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బళ్లారి - గుంతకల్లు హైవేపై (bellary guntakal highway) పనులు జరుగుతున్నాయి. వీటిని నిర్వహిస్తున్న కాంట్రాక్టర్.. రోడ్డుపై ఎలాంటి సైన్ బోర్డులు పెట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
