శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న స్కార్పియో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయరహదారిపై తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు అతివేగంగా వస్తూ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించి వారి సహకారంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.