ఇచ్ఛాపురం: విజయ సంకల్ప స్థూపం పునాదే రాబోయే మూడు నెలల్లో రానున్న రాజన్న రాజ్యానికి నాంది అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు వేడుకలో పాల్గొనేందుకు ఇచ్ఛాపురం చేరుకున్న ఆమె జగన్ పాదయాత్రకు వచ్చిన ఆశేష జనవాహిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. 

వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేపట్టారని చెప్పుకొచ్చారు. 

ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ ను అంతమెుందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని ఆరోపించారు. వైఎస్ జగన్ పై కత్తి దాడి చంద్రబాబు నాయుడు చేయించారని ఆమె ఆరోపించారు. 

జగన్ పై దాడి వెనుక నారా వారి కత్తి ఉందని రోజా ఆరోపించారు. జగన్ పై దాడికేసును ఎన్ఐఏకు అప్పగించడంతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుడుతోందని రోజా అన్నారు. తొందర్లోనే చంద్రబాబును జైలుకు పంపక తప్పదన్నారు.