చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఆర్జేడీ నేత మనోజ్ ఝా.. జగన్ సర్కార్‌పై ఫైర్..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎంపీ మనోజ్‌ ఝా ఖండించారు.

RJD leader Manoj Jha condemn Chandrababu Naidu arrest and attacks YS Jagan Govt ksm

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మనోజ్‌ ఝా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై విపరీత ధోరణితో వెళ్లడం భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌గా మారిందని అన్నారు. 

రాజకీయ ప్రత్యర్థులను కటకటాల వెనక్కి నెట్టడం ప్రధాని మోదీ, హెచ్‌ఎం అమిత్ షా సంప్రదాయమని.. కొత్త శిష్యులు కూడా దానిని ఫాలో అవుతున్నారని మనోజ్ ఝా అన్నారు. ప్రత్యర్థులను జైలు పెట్టడాన్ని మోదీ, అమిత్ షాల నుంచి జగన్ నేర్చుకున్నారని.. అలాంటి చర్యలకు ఎక్కువ కాలం ఉండదని  అన్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదని.. ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పారు. 

ఇక, ఇక, నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ రఘురామిరెడ్డి తెలిపారు. అయితే ఈ పరిణామాలపై టీడీపీ  శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పలువురు రాష్ట్రంలోని టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios