పెళ్ళికి ఒప్పుకోలేదని నగ్న చిత్రాలు అప్‌లోడ్

హైదరాబాద్:భార్య బతికుండగానే ఆమె చనిపోయిందని చెప్పి మరో పెళ్ళి చేసుకొనేందుకు నాగపూర్ కు చెందిన రంజాన్ అనే వ్యక్తి తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. అయితే రంజాన్ నిజస్వరూపం తెలుసుకొన్న మహిళ అతడిని దూరం పెట్టింది. అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఫోటోలను మార్పింగ్ చేసి ఫేస్‌బుక్ లో అప్‌లోడ్ చేశాడు. బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.


మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన చెందిన రంజాన్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి వివాహమై భార్య,పిల్లలు కూడ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి తన భార్య చనిపోయిందని రంజాన్ అలియాస్ రియాజ్ అన్సారీ ప్రయత్నం చేశాడు. 


రంజాన్ అలియాస్ రియాజ్ అన్సారీ షాదీ. కామ్‌లో తన ప్రోఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు. తన భార్య చనిపోయిందని, తనకు ఓ కూతురు ఉందని ఆ ఫ్రోఫైల్ లో ప్రకటించాడు తన కూతురు కోసం తాను రెండో పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నానని ఆయన ఆ ప్రోఫైల్ లో ప్రకటించారు. అయితే తన ఫ్రోపైల్ నచ్చితే లైక్ కొట్టాలని ఆయన కోరాడు. అయితే ఈ ప్రోఫైల్ ను చూసిన పశ్చిమగోదావరి జిల్లా ఓ మహిళ లైక్ కొట్టింది.

ఆమెకు కూడ భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. రెండో వివాహనికి సిద్దమని ఆమె అంగీకారాన్ని తెలిపింది. ఇద్దరూ కూడ షాదీ.కామ్‌ ద్వారా ఏర్పడిన పరిచయాన్ని
కొనసాగించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా తమ బంధాన్ని ఇంకా కొనసాగించారు. ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆ మహిళను నమ్మించాడు. అంతేకాదు తాను ట్రావెల్స్
వ్యాపారాన్నికూడ నడుపుతున్నానని కూడ ఆయన ప్రకటించాడు.

రంజాన్ ను నమ్మిన వివాహిత తన కుటుంబసభ్యుల ఫోటోలనేు కూడ అతడికి షేర్ చేసింది. అయితే భర్త ప్రవర్తనతో అనుమానం వచ్చిన రంజాన్ భార్య అతడి ఫోన్ ను ఒకరోజు
పరిశీలించింది. భర్త రెండో పెళ్ళి కోసం ప్లాన్ చేస్తున్న విషయాన్ని ఆమె గమనించింది. దీంతో ఆమె పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఫోన్ చేసి తన భర్తను మోసం చేస్తున్నాడని చెప్పింది. తాను బతికే ఉన్నట్టు చెప్పింది. దీంతో ఆ మహిళ రంజాన్ ను దూరంగా పెట్టింది, ఛాటింగ్, ఫోన్లు చేయడం మానేసింది.


దీంతో రంజాన్ బాధితురాలి పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేశాడు. తనకు పంపిన ఫోటోలను మార్పింగ్ చేసి నగ్నంగా అప్‌లోడ్ చేశాడు. దీంతో బాధితురాలు ఫేస్‌బుక్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఐడీని ఫేస్ బుక్ తొలగించింది. బాధితురాలి సోదరి ఫోటోలను కూడ అప్‌లోడ్ చేయడమే కాకుండా ఆమె ఫోన్ నెంబర్లను కూడ ఇచ్చాడు. దీంతో బాధితురాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


అయితే తనను వేధింపులకు పాల్పడకూడదని బాధితురాలు రంజాన్ ను వేడుకొంది. కానీ , అతను మాత్రం ససేమిరా అన్నారు. తనను పెళ్ళి చేసుకొని నాగపూర్ కు రావాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే హైద్రాబాద్ కు వచ్చిన రంజాన్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.