మంత్రి భూమా అఖిలప్రియకు, టిడిపిలో కీలక నేత ఏవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి.
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ టిడిపిలో కలకలం రేగింది. మంత్రి భూమా అఖిలప్రియకు, టిడిపిలో కీలక నేత ఏవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఎలాగంటే, గురువారం రెండు వర్గాలు రోడ్డునపడి కొట్టుకున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే నంద్యాల, ఆళ్ళగడ్డలో ఏవి సుబ్బారెడ్డికి మంచి పట్టుంది. అందుకని వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ అసెంబ్లీ టిక్కెట్టుపై కన్నేశారు.
ఏవి సుబ్బారెడ్డి కన్నేసినంత మాత్రనా టిక్కెట్టు సాధ్యమవుతుందా? ఎందుకంటే, మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్ళగడ్డ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు అవకాశాలు మంత్రికే అవకాశాలున్నాయి. అందుకనే మంత్రిని కాదని తాను టిక్కెట్టు తెచ్చుకోవటానికి ఏవి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
అసలే మంత్రికి, ఏవికి ఏమాత్రం పడదు. దాంతో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏవిని తొక్కేయటానికి మంత్రి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నంద్యాలకు చెందిన ఏవి ఆళ్ళగడ్డలో కార్యకర్తల కోసం ఓ హెల్పలైన్ ఏర్పాటు చేయాలనుకున్నారు.
అందుకు ఈరోజు ముహూర్తాన్ని ఎంచుకున్నారు. దాంతో మంత్రికి మండింది. అందుకని హెల్ప్ లైన్ ఏర్పాటును అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య గొడవ ముదిరిపోయింది. ఎప్పుడైతే ఇరు వర్గాలు ఒకేచోట ఎదురుపడ్డాయో వివాదం తారస్ధాయికి చేరుకుంది. మాటలు పెరిగి చివరకు కొట్టుకునేదాకా వెళ్ళింది.
ఈ పరిణామాలు ముందే ఊహించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రెండు వర్గాలను వెళ్ళగొట్టారు. దాంతో ఆళ్ళగడ్డ టిడిపిలో ఎప్పుడేమవుతుందో అని మిగిలిన నేతలు హడలిపోతున్నారు. విషయమంతా చంద్రబాబు దృష్టికి కూడా చేరిందట. ఏమవుతుందో చూడాలి.
