RGV: పిఠాపురం నుంచి పోటీ.. ఆర్జీవీ ట్విస్ట్.. !
Ram Gopal Varma: పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాను చాలా సీరియస్ గా ఉన్నానని చెప్పడంపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్రంగా స్పదించారు. అయితే, తాను చెప్పిన అసలు విషయం అదికాదని ఆర్జీవీ ఇప్పుడు ట్విస్టు ఇచ్చారు.
Pithapuram - Ram Gopal Varma : ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తానని ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాతి పోస్టులో దీనిపై తాను సూపర్ సీరియస్ గా ఉన్నానని పేర్కొన్నాడు. 'ఆకస్మిక నిర్ణయం.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషంగా ఉంది' అని ఆయన ఎక్స్ లో రాశారు. కొన్ని గంటల తర్వాత, చాలా మంది ఎక్స్ యూజర్లు ఈ ప్రకటనపై సందేహం వ్యక్తం చేశారు. అందులో సందేహం లేదంటూ చాలా సీరియస్ గా ఉన్నానని చెప్పారు. ఏం పార్టీ నుంచి పోటీ చేస్తారు? అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.
తన ట్విట్ లో ఎన్నికలు అనే ప్రస్తావన లేకుండా పోటీ చేస్తానని మాత్రమే ప్రకటించారు. ఇదే క్రమంలో అంతకుముందు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇది జరిగిన కొంత సమయం తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆర్జీవీపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ విమర్శల పర్వం షురూ చేశారు. ఇదంతా జరిగిన ఒక రోజు తర్వాత తిన్నట పిఠాపురంలో పోటీ చేయడం గురించి ఆర్జీవీ మరో ట్విస్టు ఇచ్చాడు.
LPG Cylinder Prices : గుడ్‌న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి !
తన ట్వీట్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని షాక్ ఇచ్చాడు. తాను పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశాడు. తాను ఎక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పలేదన్నాడు. "నా ట్వీట్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎన్నికల్లో బరిలో నిలవడం లేదు. నేను ఎక్కడా ఎన్నికలు అనే పదాన్ని వాడలేదు. నేను పిఠాపురంలో షూట్ చేసిన ఒక ప్రాజెక్టుతో ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పాల్టొంటున్నానే ఉద్దేశమని" ట్విస్ట్ ఇచ్చాడు.